ఏపీ కరోనా అప్డేట్
- June 24, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,622 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,981 మంది పాజిటివ్‌గా తేలింది.కోవిడ్ బారినపడి మరో 38 మంది మృతి చెందారు.తాజాగా మృతుల్లో చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పు. అనంతపూర్, కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇక, గత 24 గంటల్లో ఏపీలో 6,464 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం .. దీంతో.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 18,64,122కు చేరుకోగా.. కోలుకున్న వారి సంఖ్య 18,01,949కి పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,490 మంది మరణించగా.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 49,683గా ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,14,49,636కి చేరింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







