వ్యాక్సిన్ పొందిన వాళ్లకే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి
- June 25, 2021
కువైట్: రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పబ్లిక్ ప్లేసులలో ప్రజా సంచారంపై ఆంక్షలు విధిస్తోంది కువైట్ ప్రభుత్వం. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే పబ్లిక్ ప్రాంతాల్లో అనుమతి ఉంటుందని ప్రకటించింది. జూన్ 27 ఆదివారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. వ్యాక్సిన్ పొందిన వారే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతించేలా కువైట్ ప్రభుత్వం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దింపనుంది. 6000 స్క్వైర్ మీటర్ల కంటే ఎక్కువగా ఉండే మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లు, జిమ్ములు, షాప్స్ దగ్గర ఈ బృందాలు తమ విధులు నిర్వహించనున్నాయి. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తేనే లోనికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇటీవలి కాలంలో కువైట్ లో వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారిన పడుతుండటంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పబ్లిక్ ప్లేసులలో ఎంట్రీకి వ్యాక్సిన్ తో లింక్ పెట్టింది ఆరోగ్య శాఖ.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







