కోవిడ్ ఎఫెక్ట్ తో బహ్రెయిన్ లో మరో మసీదు మూసివేత

- June 25, 2021 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్ తో బహ్రెయిన్ లో మరో మసీదు మూసివేత

బహ్రెయిన్: కోవిడ్ కారణంగా బహ్రెయిన్లో మరో మసీదును తాత్కాలికంగా మూసివేశారు. ప్రార్థనకు వచ్చిన భక్తుల్లో కోవిడ్ పాజిటివ్ కేసు నిర్ధారణ కావటంతో ముహర్రాఖ్ గవర్నరేట్ పరిధిలోని మసీదును వారం పాటు మూసివేస్తున్నట్లు ఇస్లామిక్ వ్యావహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తితో ఇంకా ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో ట్రేస్ చేయటంతో పాటు మసీదు ప్రాంగణంలో క్రిమిసంహారక చర్యలను చేపట్టారు అధికారులు. వారం తర్వాత తిరిగి ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే...రోజులో ఐదు ప్రార్ధనలకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..ప్రార్థనకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అధికారులు సూచించారు. ప్రోటోకాల్ పాటించని ప్రాంతాల్లో మసీదులను మూసివేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com