ఫ్రాడ్ ఈ మెయిల్స్ తో జర జాగ్రత్త..DEWA హెచ్చరిక!
- June 25, 2021
యూఏఈ: బిల్ పేమెంట్ తో వచ్చే ఈ మెయిల్స్ పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ ఎలక్ట్రిసిటీ& వాటర్ అథారిటీ DEWA హెచ్చరించింది. బిల్ పేమెంట్లు చేయాలంటూ కొందరు సైబర్ నేరగాళ్లు DEWA పేరుతో ఈ మెయిల్ పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అప్రమత్తం చేశారు. DEWA పేరుతో వచ్చే ఈ మెయిల్స్ సరైనవో లేదా ఫ్రాడ్ ఈ మెయిల్సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించింది. నకిలీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తిస్తే ఎట్టిపరిస్థితుల్లో అటాచ్మెంట్ ఫైల్ ఒపెన్ చేయోద్దని అధికారులు హెచ్చరించారు. ఆ అటాచ్మెంట్ ఫైల్స్ ఓపెన్ చేయగానే మాల్ వేర్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. విద్యుత్, కరెంట్ బిల్లులను DEWA అధికారిక ఛానెల్ ద్వారానే చెల్లించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







