Delta Plus: ఏపీలో తొలి కేసు నమోదు
- June 25, 2021
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నమోదైందని తెలిపారు. అయితే డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తి అయిందని.. బాధితుడి నుంచి ఇతరులెవరికీ వ్యాపించలేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
తాజా వార్తలు
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!







