కరోనా తో మరణించిన వ్యక్తికి ఒమన్ లో అంత్యక్రియలు

- June 26, 2021 , by Maagulf
కరోనా తో మరణించిన వ్యక్తికి ఒమన్ లో అంత్యక్రియలు

మస్కట్: హైదరాబాద్ లో కుటుంబం తో నివాస ముంటున్న సంగారెడ్డి జిల్లా బీరంగుడా కు చెందిన పొందర లక్ష్మి నారాయణ పాత్రో గత పదునాలుగు సంవత్సరాలుగా ఒమన్ లోని ఒక కంపెనీ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు.ఇటీవల కరోనా సోకడంతో  పదిహేను రోజులు ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ ఈ నెల 18 న తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాక పోవడం తో  సదరు కంపనీ యజమాన్యం ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు ను సంప్రదించగా వారు తమ బృందం తో ఈ రోజు సోహార్ లోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా నరేంద్ర వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ మృతిని కి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే కంపెనీ తో మాట్లాడి అతని కుటుంబానికి అందెలా చూస్తామని, తమ సంస్థ నుండి కూడా సహాయం అందిస్తామన్నారు.ఈ అంత్యక్రియల్లో మంచికట్ల కుమార్, మామిడి శ్యాం, పిట్ల రాజు, వెల్దుర్తి ప్రమోద్, వంకాయల కార్తీక్, వేమన కుమార్ కాశ, పర్లపెళ్లి రమేష్తో పాటు కంపెనీకి చెందిన పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com