తొలిసారి పాట పాడిన నటి త్రిష

- March 08, 2016 , by Maagulf
తొలిసారి పాట పాడిన నటి త్రిష

నటి త్రిష తన తరువాతి చిత్రం 'నాయకి' కోసం తొలిసారి పాట పాడారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్‌ చేశారు. నాయకి చిత్రం కోసం ఓ పాటను రికార్డు చేసినట్లు తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, సుష్మారాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేశ్‌, జయప్రకాశ్‌, మనోబాల తదితరులు చిత్రం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'నాయకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com