రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం
- March 08, 2016
బేగంపేట ఎయిర్పోర్టు గులాబీమయమైంది. సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి మొదలుకొని క్యాంపు ఆఫీస్ దాకా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక వందలాది మంది కళాకారులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తమ దేవుడు కేసీఆరే అని రైతులు నినదిస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లు నెరవేరని కల ఈనాడు నెరవేరడం సీఎం కేసీఆర్తో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ - మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరిన విషయం విదితమే.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







