తొలి క్వాలిఫయర్‌లో జింబాబ్వే గెలుపు
- March 08, 2016
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో ఛేదనలో హాంకాంగ్ తడబడి 144/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ గెలిచిన హాంకాంగ్.. జింబాబ్వేని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సిబండ అర్థశతకం (59 పరుగులు; 5×4, 2×6), చిగుంబుర మెరుపు బ్యాటింగ్ (30 పరుగులు; 3×6)తో జింబాబ్వే 158 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ జట్టులో జేమ్స్ అట్కిన్సన్ అర్థశతకం (53 పరుగులు; 4×4, 2×6), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తన్వీర్ అఫ్జల్ (31 పరుగులు; 3×4, 1×6) దూకుడుగా ఆడినా చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు కావాల్సి ఉండగా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలడంతో ఓటమి తప్పలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







