తొలిసారి పాట పాడిన నటి త్రిష
- March 08, 2016
నటి త్రిష తన తరువాతి చిత్రం 'నాయకి' కోసం తొలిసారి పాట పాడారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. నాయకి చిత్రం కోసం ఓ పాటను రికార్డు చేసినట్లు తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి, రాజ్ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, సుష్మారాజ్, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్, మనోబాల తదితరులు చిత్రం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'నాయకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







