స్వర్ణోత్సవాల్లో భారీ మెడల్ తో విద్యార్ధుల గిన్నిస్ రికార్డ్
- June 27, 2021
యూఏఈ: భారీ మెడల్ తో అబుధాబిలోని ఇండియన్ స్కూల్ విద్యార్ధులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 450 కేజీల బరువు, 5.93 చదరపు మీటర్ల వైశాల్యంతో స్టీల్ మెడల్ ను రూపొంది పాత రికార్డ్ ను బ్రేక్ చేశారు. గతంలో 68.5 కిలోల బరువు, 2.56 చదరపు మీటర్ల వైశాల్యంతో రూపొందిన మెడల్ రికార్డులో చోటు దక్కించుకుంది. అయితే...అబుధాబిలోని బనియస్ వెస్ట్ లోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ విద్యార్ధులు పాత రికార్డును బద్దలు కొట్టేశారు. స్వర్ణోత్సవాల(గోల్డెన్ జూబ్లి)ను జరుపుకుంటున్న వేళ యూఏఈకి సేవలు అందించి దేశ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన దివంగత నేతలకు ఈ భారీ మెడల్ తో తమ నివాళులు అర్పిస్తున్నట్లు స్కూల్ విద్యార్ధులు, సిబ్బంది తెలిపారు. గోల్డెన్ జూబ్లీ యూఏఈ ఔన్నత్యాన్ని, విజయాలను చాటిచెప్పేలా మహా కార్యం చేయాలనుకున్నామని అందులో భాగంగా విద్యార్ధులు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పడం సంతోషకరమైన విషయమని స్కూల్ నిర్వాహకులు వెల్లడించారు. అయితే..కోవిడ్ నేపథ్యంలో స్కూల్ విద్యార్ధులు, స్టాఫ్, తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







