ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- November 28, 2026
కువైట్ : ఇరాన్ దాడిలో గాయపడిన వారిని కువైట్ రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్ సలేం అల్ సబా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అల్ షురైయాన్‌తో కలిసి రక్షణ మంత్రి గాయపడిన వారిని పరామర్శించినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సందర్భంగా వైద్య బృందం గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, వైద్య ప్రక్రియల గురించి మంత్రికి వివరించింది. గాయపడిన వారికి అవసరమైన వైద్య సేవలు, ప్రత్యేక శ్రద్ధ అందిస్తున్న వైద్య సిబ్బంది కృషిని రక్షణ మంత్రి ప్రశంసించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని, భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి
- పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు..భారత్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..







