హైదరాబాద్: లింకు రోడ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- June 28, 2021
హైదరాబాద్: హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు 5 లింకు రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 16 లింకు రోడ్లను పూర్తి చేశామని, వీటితో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. రూ. 6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అంతేగాక, హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అదనంగా మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దశలవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. మౌలిక వసతుల విస్తరణలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







