12 గంటల ఫ్లాష్ సేల్: 90 శాతం వరకు డిస్కౌంట్లు
- June 28, 2021
దుబాయ్: దుబాయ్ సమ్మర్ స్పెషల్.. అదే 12 గంటల పాటు జరిగే సూపర్ సేల్ అందుబాటులోకి వచ్చింది. జులై 1న ఈ సేల్ వుంటుంది. 25 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లు 100కి పైగా బ్రాండ్లపై లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేల్ కొనసాగుతుంది. మాజిద్ అల్ ఫుత్తైమ్ మాల్స్ వద్ద మాత్రమే ఈ సేల్ వుంటుంది. మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డేరా, సిటీ సెంటర్ మైసెమ్, మై సిటీ సెంటర్ అల్ బర్షా మరియు సిటీ సెంటర్ అల్ షినందగా మాల్స్ ఈ సేల్ కోసం వేదికలుగా మారుతున్నాయి. లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ సేల్ సందర్భంగా ప్రధాన ఆకర్షణ కానుంది. 300 దిర్హాములు ఖర్చు చేసే వినియోగదారులకు లక్కీ డ్రాలో పాల్గొనే అవకావం కలుగుతుంది. 1 మిలియన్ మాజిద్ అల్ ఫుత్తైమ్ షేర్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి గెలిచివారికి. షేర్ యాప్ ద్వారా వినియోగదారులు తమ రసీదుల్ని స్కాన్ చేసుకుని, డ్రాలో పాల్గొనవచ్చు. జులై 4న విజేతను ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









