'ఒకే ఒక జీవితం' ఫస్ట్ లుక్ .!
- June 28, 2021
ఈ యేడాది 'శ్రీకారం'తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్ళు మీకు జోహార్లు' చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒకటి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్ ఖరారు చేశారు. శర్వానంద్ సరసన రీతువర్మ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమల అక్కినేని, ప్రియదర్శి, 'వెన్నెల' కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలిదశ లాక్ డౌన్ కంటే ముందే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా చివరి షెడ్యూల్ గత యేడాది అక్టోబర్ లో జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. శర్వానంద్ నటిస్తున్న ఈ 30వ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇదే నిర్మాతలు రెండేళ్ళ క్రితం 'ఖైదీ' లాంటి బ్లాక్ బస్టర్ ను అందించడం విశేషం.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి







