వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి
- June 29, 2021
అబుధాబి: వ్యాక్సిన్ తీసుకున్న వారినే కొన్ని పబ్లిక్ ప్రాంతాలకు అనుమతి ఉంటుందని అబుధాబి విపత్తులు, అత్యవసర నిర్వహణ కమిటీ ప్రకటించింది. ఆగస్ట్ 20 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఆలోగా అబుధాబిలోని లక్ష్యంగా ఎంచుకున్న గ్రూపుల్లో 93 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని అంచనా వేస్తోంది. 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అవుతుంది కనుక..కొన్ని పబ్లిక్ ప్రాంతాల్లోకి కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతి ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వం పేర్కొన్న పబ్లిక్ ప్రాంతాల జాబితాలో షాపింగ్ సెంటర్స్, రెస్టారెంట్లు, కేఫ్ లు, జిమ్ములు, రిక్రియేషన్ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, షాపింగ్ సెంటర్స్ వెలుపలు ఉన్న రిటేల్ ఔట్ లెట్స్ ఉన్నాయి. అలాగే క్లబ్బులు, రిసార్ట్స్, మ్యూజియమ్స్, థీమ్ పార్క్, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల్లోకి ఆగస్ట్ 20 నుంచి వ్యాక్సిన్ పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులు, మినహాయింపు పొందిన వారు, 15 ఏళ్లలోపు పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







