ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- March 26, 2026
దోహా: ఖతార్ ను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత వాతావరణ హెచ్చుతగ్గుల నేపథ్యంలో వృత్తిపరమైన భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసే క్రమంలో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) సేఫ్టీ గైడ్ లైన్స్ ను జారీ చేసింది. పని ప్రదేశంలో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు అందరికీ సురక్షితమైన పని వాతావరణాన్ని కొనసాగించడానికి వీలుగా ఈ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. యజమానులు మరియు కార్మికులందరూ కార్మిక శాఖ మార్గదర్శకాలను పాటించాలని కోరింది.
ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ప్రమాదకరమైన పనులను నిర్వహించే క్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే పరిస్థితులకు అనుగుణంగా అధిక-ప్రమాదకర కార్యకలాపాలను నిలిపివేయాలంది. వాటర్ డ్రైన్ వ్యవస్థలు పనిచేస్తున్నాయని మరియు వర్క్ సైట్‌లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం వంటి భద్రతపరమైన పనులను నిరంతరం సమీక్షించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో కార్మికుల రవాణా విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పని గంటలను సర్దుబాటు చేయాలని మంత్రిత్వశాఖ సూచించింది. వాహనాలు సురక్షితంగా ఉండేలా నిరంతరం సమీక్షించాలని, అన్ని సమయాల్లో సురక్షిత డ్రైవింగ్ పద్ధతులను పాటించాలని ఆదేశించింది.
కార్మికుల వసతి గృహాల విషయానికొస్తే, అక్కడ నీరు నిలవకుండా మరియు ప్రమాదాలు లేకుండా చూసుకోవాలని, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, నిత్యావసర వస్తువుల సరఫరాను అందుబాటులో ఉంచుకోవాలని మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉండాలని కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది.
ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను నిర్వహించడం ద్వారా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైనప్పుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ కాంట్రాక్టులను, కార్మికులకు సూచించింది. ఈ మేరకు అవగాహన వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







