ఎల్‌ఐసీ కస్టమర్లకు సులువుగా లోన్..!
- June 29, 2021
మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి. ఇలా చేస్తే ఎల్‌ఐసీ కస్టమర్స్ సులభంగా లోన్ పొందొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
ఎల్ఐసీ పాలసీదారులు వారి పాలసీపై పర్సనల్ లోన్ పొందొచ్చు. అంటే పాలసీని తనఖా పెట్టాలి. ఇది ఇలా పని చేస్తుంది అనే విషయంలోకి వస్తే… మనీ బ్యాక్, ఎండోమెంట్, యాన్యుటీ వంటి పలు రకాల పాలసీలపై లోన్ పొందొచ్చు. అన్ని రకాల పాలసీలపై రుణ సౌకర్యం పొందటానికి వీలుండదు. టర్మ్, హెల్త్ ప్లాన్లపై లోన్ తీసుకోవడానికి అవ్వదు.
ఇక వడ్డీ రేట్లు గురించి చూస్తే.. పర్సనల్ లోన్‌పై బ్యాంకులు వసూలు చేస్తే వడ్డీ రేటు కన్నా ఎల్‌ఐసీ పాలసీపై పొందే రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ 10.5 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
మీ పాలసీ సెరండర్ విలువలో 90 శాతం మొత్తం వరకే ఎల్‌ఐసీ రుణం అందిస్తుంది గమనించండి. బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ వంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే పాలసీ డాక్యుమెంటు కచ్చితంగా ఇవ్వాలి. లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వెళ్లి సంప్రదించండి.
పాలసీపై లోన్ పొందాలంటే ఈ రూల్స్ తప్పక పాటించాలి:
ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం కచ్చితంగా మూడేళ్లు చెల్లించి ఉండాలి. కనీసం 6 నెలల టెన్యూర్‌తో లోన్ పొందాల్సి ఉంటుంది.
అలానే లోన్ వడ్డీ డబ్బులను ఏడాదికి రెండు సార్లు కట్టేస్తూ రావాలి.
మీరు లోన్ డబ్బులు కట్టకపోతే అప్పుడు ఎల్‌ఐసీ మీ పాలసీ డబ్బుల్లో లోన్ డబ్బులను కట్ చేసుకుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







