భారత్ లో ట్విట్టర్ పై కేసు నమోదు .!
- June 29, 2021
ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్‌కు ఉచ్చు బిగుస్తోంది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరిపైనా కేసు నమోదైంది. ఇండియా మ్యాప్ వివాదంపైనా యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీశ్ మహేశ్వరి పేరును కూడా చేర్చారు. అయితే ఇప్పటికే మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయంపై మనీశ్‌పై కేసు నమోదు అయింది. ఈ నెలలోనే ఆయనపై యూపీలో రెండో కేసు నమోదు కావడం ట్విట్టర్ తీరకు నిదర్శనంగా మారింది.
ట్విట్టర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్ కేంద్రం వార్నింగ్ తో వెనక్కి తగ్గింది. తప్పుడు మ్యాప్ వెబ్ సైట్ నుంచి తొలగించింది. జమ్ముకశ్మీర్, లడఖ్ ను భారత్ వెలుపల చూపించడాన్ని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సైతం ట్విట్టర్ చర్యను తీవ్రంగా పరిగణించాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా ట్విట్టర్ తీరు మార్చుకోవడం లేదు. భారత ఐటీ చట్టాలను సైతం ట్విట్టర్ లెక్కచేయడం లేదు. ఐటీ నిబంధనలను అమలు విషయంలో కేంద్రంతో వార్ నడుస్తోంది.
తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో..ట్విట్టర్.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. అందుకు కొంత సమయం కావాలని కోరింది. ప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర కీలక నేతలకు చెందిన బ్లూ టిక్ మార్కులను తొలగించడం వివాదాస్పదమైంది. అనంతరం అకౌంట్ రీయాక్టివేట్ చేసింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌కు వార్నింగ్ మెసేజ్ పంపడంతో గంట తర్వాత అకౌంట్‌ను అన్ బ్లాక్ చేసేంది ట్విట్టర్.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







