'కళ్యాణ వైభోగమే' టీమ్‌తో మరో సినిమా
- March 08, 2016
- నిర్మాత దామోదర్‌ప్రసాద్ ''నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. నాగశౌర్య, మాళవికా నాయర్, సాయి రిత్విక్ 100 శాతం వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇండస్ట్రీలో నన్ను ఎవరూ నమ్మనప్పుడు దామోదర్‌గారు నమ్మి ఈ చిత్రం తీశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టినందుకు గర్వంగా ఉంది. మా చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు'' అని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన 'కళ్యాణ వైభోగమే' ఇటీవల విడుదలైంది.ఈ చిత్రం ప్లాటినమ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ''ఈ టీమ్ నా ఫ్యామిలీ లాంటిది.అలా మొదలైంది' తర్వాత మళ్లీ అదే కాంబినేషన్లో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. ఇదే టీమ్‌తో త్వరలో మరో సినిమా చేస్తా'' అని నిర్మాత తెలిపారు. ''ఈ చిత్రంలోని పెళ్లి పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా పెళ్లిలో అదే పాట పెట్టుకుంటా. ఇప్పటి దాకా 8 చిత్రాలు చేసినా దేనికీ రాని ప్రశంసలు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది'' అని నాగశౌర్య చెప్పారు. సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, కెమేరామ్యాన్ జివిఎస్ రాజు, రచయిత లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







