మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ : సీఎం జగన్
- June 29, 2021
అమరావతి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని సిఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన 'దిశ' మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ఎపి సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ... దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందని అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని సిఎం గుర్తుచేశారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని అభివర్ణించారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సిఎం జగన్ కోరారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సిఎం జగన్ పేర్కొన్నారు.



తాజా వార్తలు
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…









