దిశ యాప్ ఉపయోగాలు...
- June 29, 2021
అమరావతి: ఏపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో దిశ యాప్‌ను రూపోందించి విడుదల చేసింది.దీనికి సంబందించి చట్టాన్ని, దిశ పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది.దిశ యాప్ పై విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.ప్రతి మహిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.ఇక ఈ యాప్ వివరాలు...
దిశ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్ వెర్షన్‌ను యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తరువాత వ్యక్తిగత వివరాలు, అత్యవసర సమయంలో సమయం అందించేందుకు వీలుగా అదనపు కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్లు ఇవ్వాలి. మహిళలు ఆపదలో ఉన్నామని భావించినపుడు యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే 10 సెకన్ల వీడియోతో పాటు, మొబైల్ లోకేషన్ తో దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది.సిబ్బంది దగ్గరలోని పోలీసులకు అలర్ట్ చేయడం ద్వారా నిమిషాల వ్వవధిలో మహిళలను ఆపద నుంచి రక్షించే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ప్రయాణం చేసే సమయంలో రక్షణకోసం ట్రాక్ మై ట్రావెల్ అనే అప్షన్ లో గమ్యస్థానం వివరాలు ఎంటర్ చేస్తే, ఆమె ప్రయాణం పూర్తయ్యే వరకు అనుక్షణం ట్రాకింగ్ జరుగుతుంది. వాహనం మార్గం మారినా,ఎదైనా ప్రమాదం జరిగినా వెంటనే సిబ్బందిని అలర్ట్ చేస్తుంది.మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







