200 కేంద్రాల ద్వారా మెగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను చేపట్టిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్
- June 29, 2021
హైదరాబాద్: జాతీయ వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి అపోలో హాస్పిటల్స్ 2021, జూన్ 30వ తేది బుధవారం నాడు దేశవ్యాప్తంగా మెగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఈరోజున ప్రకటించింది. దేశంలోని 50 నగరాల్లో విస్తరించి ఉన్న 200 అపోలో వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ భారీ ఎత్తున నిర్వహించబడుతుంది.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ సులభంగా మరియు వేగంగా అందుబాటులో ఉంచడానికి అపోలో యొక్క అత్యాధునిక సాంకేతిక వేదిక అయినటువంటి అపోలో 24/7 యాప్‌ను ఉపయోగించి స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు మరియు తమకు సమీపంలోని అపోలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. వేచి వుండే సమయాన్ని మరియు లైన్లను తగ్గించి తమకు ఇష్టమైన స్లాట్‌ను ఎంపిక చేసుకోవడంలో యాప్ వినియోగదారుడికి రియల్ - టైమ్ సమాచారాన్ని అందిస్తుంది.
గరిష్ట సంఖ్యలో వ్యక్తులకు వ్యాక్సిన్లు అందించడం కోసం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ అపోలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించడం జరుగుతుంది, తద్వారా ప్రతి ఒక్కరు వారి యొక్క సౌలభ్యం ప్రకారం స్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
అన్ని వ్యాక్సిన్ కేంద్రాలలో ఎటువంటి అంతరాయం అనేది లేకుండా సురక్షిత వ్యాక్సిన్ ప్రోటోకాల్స్‌పై అపోలో 10,000 మంది సిబ్బందికి శిక్షణను అందించింది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్, ఎగ్జిక్యూటివ్ వైస్ - చైర్పర్సన్, శోభన కామినేని మాట్లాడుతూ, ‘‘ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ను అందుకునే వరకు ఏ ఒక్కరూ కూడా సురక్షితం కాదని మేము నమ్ముతున్నాము. గరిష్ట సంఖ్యలో వ్యక్తులు వ్యాక్సిన్‌ను అందుకోవడానికి ఈ డ్రైవ్ వీలు కల్పిస్తుంది. కోవిడ్ 3వ వేవ్‌ను తగ్గించడంలోనూ మరియు మనం తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడంలోనూ వ్యాక్సినేషన్ అనేది అత్యుత్తమమైన రక్షణ అని చెప్పవచ్చు. అపోలో దీనిపై దృఢ నిశ్చయంతో దృష్టి పెట్టింది” అని ఆమె అన్నారు.
2021 జూలై నాటికి 500 మిలియన్ల వ్యాక్సిన్లను అందించాలనే లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవడంలో అపోలో యొక్క నిబద్దతకు ఈ డ్రైవ్ ఒక భాగం.
అపోలో ఈరోజు వరకు దేశంలో 2.1 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చి అతిపెద్ద ప్రయివేటు వ్యాక్సినేటర్‌గా నిలిచింది. ఈ మెగా క్యాంప్‌కు వచ్చే స్పందన ఆధారంగా అపోలో కేంద్రాలు వ్యాక్సినేషన్ శిబిరాలను కొనసాగిస్తాయి. సంకోచించకండి,వ్యాక్సిన్ తీసుకోండి!
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







