జులై 21 వరకు ఇండియా - అబుధాబి విమానాల సస్పెన్షన్ కొనసాగింపు: ఎతిహాద్
- June 29, 2021
అబుధాబి: అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఇండియా నుంచి అబుధాబికి నడిచే విమానాల్ని జులై 21 వరకు సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ సస్పెన్షన్ అమల్లో వుందని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా ఓ ప్రయాణీకుడు సంధించిన ప్రశ్నకు సమాధానంగా ఎతిహాద్ ఈ విషయాన్ని వెల్లడించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ, సోషల్ మీడియా వేదికగా వివిధ దేశాల నుంచి విమానాల రద్దుపై ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్తాన్, లైబీరియా, నాంబియా, సియెర్రా లియోన్, డిఆర్ కాంగో, ఉగాండా, జాంబియా, వియెత్నాం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా మరియు సౌతాఫ్రికా తదితర దేశాలు ఈ తాత్కాలిక నిషేధం లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









