వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల
- June 29, 2021
కువైట్: వ్యాక్సినేషన్ చేయించుకోనివారికి ‘మాల్స్’లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో, వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మాల్స్ అలాగే కమర్షియల్ కాంప్లెక్సులు, కేఫ్స్, రెస్టారెంట్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్బులు, సినిమాలు అలాగే కల్చరల్ కేంద్రాల్లోకి వ్యాక్సినేషన్ పొందనివారికి ‘నో ఎంట్రీ’ అంటూ మినిస్ట్రీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా, కొత్తగా రోజుకి 2000 నుంచి 5000 వరకు కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మిష్రెఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఒకే రోజు 25,000 డోసుల్ని అందించడం జరిగింది. ఇతర కేంద్రాల్లో 15,000 డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. మొత్తంగా ఒకే రోజు.. 40,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







