దుబాయ్: గర్భిణిలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం

- June 30, 2021 , by Maagulf
దుబాయ్: గర్భిణిలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం

దుబాయ్: గర్భిణిలకు కూడా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు దుబాయ్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. జులై 29 నుంచి దుబాయ్ లోని అన్ని డీహెచ్ఏ వ్యాక్సిన్ సెంటర్లలో గర్భిణిలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపింది. అయితే..వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్న వారు డీహెచ్ఏ యాప్ ద్వారాగానీ వాట్సాప్ నెంబర్  800342 ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవటం ద్వారా అపాయింట్ తీసుకోవటం తప్పనిసరి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవాంతరాలు తలెత్తకుండా సరిపడా డోసులను ఇప్పటికే భద్రపరిచినట్లు డీహెచ్ఏ అధికారులు తెలిపారు. అయితే..వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ దృష్ట్యా వారి ఆరోగ్య పరిస్థితులను ముందస్తుగానే తమ రెగ్యులర్ డాక్టర్ తో సమీక్షించుకోవాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణిలు ముందస్తుగా వారి డాక్టర్ను సంప్రదించి తగిన సలహాలతో వ్యాక్సిన్ కు రావాలన్నారు. అంతేకాదు గర్భం దాల్చిన 13 వారాల తర్వాతే తొలి డోసు తీసుకోవటం మంచిదని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com