అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగించిన డీజీసీఏ
- June 30, 2021
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ కింద విమానాలు నడిపి, స్వదేశానికి తరలించింది. ఆ తర్వాత పలు దేశాలతో ఎయిర్ బబుల్ కింద పలు దేశాలతో జూలై నుంచి ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపుతోంది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్‌లో భాగంగా ఒప్పందాలు చేసుకుంది.

తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







