భారత్ డైనమిక్స్ లో ఉద్యోగాలు.!
- June 30, 2021
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జులై 4న ప్రారంభం కానుండగా.. దరఖాస్తుకు ఆఖరి తేదీగా జులై 19ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
మొత్తం 46 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ మేనేజర్(HR)-1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (న్యూ ప్రాజెక్ట్స్)-3, మెడికల్ ఆఫీసర్ - 2, అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ) - 3, MT(మెకానికల్)-9, MT(ఎలక్ట్రికల్)-3, MT(సివిల్)-3, MT(కంప్యూటర్ సైన్స్) -2, MT (Optics) - 1, MT (బిజినెస్ డెవెలప్మెంట్) - 1, MT(HR) విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్వహించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
-అభ్యర్థులు అప్లై చేసే సమయంలో రూ. 500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది, అభ్యర్థులు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PwD, అంతర్గత ఉద్యోగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









