కేసీఆర్‌ అందరిని మోసం చేశారు : రేవంత్‌ రెడ్డి

- June 30, 2021 , by Maagulf
కేసీఆర్‌ అందరిని మోసం చేశారు : రేవంత్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. జనాభా ప్రాతిపదికన బలహీనవర్గాలకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.. పీసీసీ చీఫ్‌ అయ్యాక తొలిసారి గాంధీభవన్‌కు వెళ్లారు రేవంత్‌ రెడ్డి.. అక్కడ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌ను ఘనంగా సత్కరించారు.. భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.. జులై 7న బాధ్యతల స్వీకరణ తర్వాత పూర్తిస్థాయి యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు తప్ప ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పుడు జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారంటూ విమర్శలు గుప్పించారు రేవంత్‌ రెడ్డి.. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదన్నారు.. సామాజిక న్యాయం జరగలేదన్నారు.. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని.. ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి మనమంతా పోరాడాలని డీసీసీలకు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com