2021 DFNI-ఆసియా అవార్డును గెల్చుకున్న కన్నూర్ డ్యూటీ ఫ్రీ
- June 30, 2021_1625064229.jpg)
కన్నూర్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (GAL) అనుబంధ సంస్థ జీఎంఆర్ కన్నూర్ డ్యూటీ-ఫ్రీ సర్వీసెస్ లిమిటెడ్ (GKDFSL) ప్రతిష్టాత్మక డ్యూటీ-ఫ్రీ న్యూస్ ఇంటర్నేషనల్ (DFNI) ఆసియా అవార్డులలో 'బెస్ట్ న్యూ షాప్ ఓపెనింగ్' విభాగంలో అవార్డును గెల్చుకుంది. ఇటీవల జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
ట్రావెల్-రిటైల్ పరిశ్రమలో DFNI గత 33 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తున్న ప్రముఖ పత్రిక. తాజా ట్రావెల్ రిటైలర్లు, బ్రాండ్లు, డిజిటల్, డిజైన్ పోకడలను ఇది వివరిస్తుంది. అవార్డు యొక్క న్యాయనిర్ణేతల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ పరిశ్రమ అనుభవజ్ఞులు ఉన్నారు.
డ్యూటీ ఫ్రీలో రిటైల్ ఆవిష్కరణలు, రిటైల్ డిజైన్ నాణ్యత, లేఅవుట్ ఫార్మాట్, కాన్సెప్ట్, వినియోగదారుడి డిమాండ్‌ను తీర్చడానికి అంతర్జాతీయ బ్రాండ్లు మరియు స్థానిక ఉత్పత్తుల ఆకర్షణీయమైన మిశ్రమం; కోవిడ్ సమయంలో అమ్మకాలను పెంచడానికి కొత్త ఆలోచనలతో సహా వివిధ అంశాల ఆధారంగా ఈ అవార్డును నిర్ణయించారు.
జీఎంఆర్ విమానాశ్రయాల బిజినెస్ డెవలప్మెంట్ సిఇఒ రాజేష్ అరోరా, “ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించే మా నిబద్ధాతకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ప్రైవేట్ విమానాశ్రయ డెవలపర్-ఆపరేటర్లలో ఒకటిగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాలలో డ్యూటీ-ఫ్రీ అవుట్లెట్లతో సహా ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, విమానాశ్రయ ప్రయాణ రిటైల్ ఆఫర్రింగ్లను సృష్టించడం జీఎంఆర్ విమానాశ్రయాల బలాన్ని సూచిస్తుంది. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మేము షాపర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ శ్రేణితో పోటీగా ఉత్తమ బ్రాండ్లను, షాపింగ్ అనుభవాన్ని అందిస్తున్నాము. ” అన్నారు.
కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ అరైవల్స్‌లో ఉన్న జీఎంఆర్ కన్నూర్ డ్యూటీ-ఫ్రీ పూర్తిస్థాయి షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్ల మద్యం, పెర్ఫ్యూమ్, కన్ఫెక్షనరీ, పొగాకు, ట్రావెల్ ఎసెన్షియల్స్, ఎంపిక చేసిన సావనీర్లు లభిస్తాయి.
కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్‌ను రూపొందించి, నిర్వహించడానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ జనవరి 2020లో కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఒక రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం GAL కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్యూటీ-ఫ్రీ షాపులకు రూపకల్పన చేసి, ఫైనాన్స్ చేసి, 7 సంవత్సరాల పాటు నిర్వహిస్తుంది. దీనిని మరో మూడేళ్లు పొడిగించవచ్చు. GAL తన అనుబంధ సంస్థల ద్వారా ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలలో డ్యూటీ-ఫ్రీ వ్యాపారాలను నిర్వహిస్తోంది. కన్నూర్ డ్యూటీ-ఫ్రీ GMR యొక్క విమానాశ్రయ పోర్ట్‌ఫోలియో బైట మొదటి కన్సెషన్.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!