వాట్సాప్: 'వ్యూ వన్స్' పేరిట కొత్త ఫీచర్..
- June 30, 2021
            ఫేస్‌బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ జుకర్‌బర్గ్, విల్ క్యాత్‌కార్ట్ ఇటీవల ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.దానికి అనుగుణంగానే తాజాగా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఇప్పుడు ఎవరైనా ఒక ఫోటో వీడియో మెసేజ్ పంపితే, దానిని అందుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు.ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న వారు ఒక ఫోటో ఎవరికైనా పంపించారని అనుకుందాం.. అది అవతలి వారు చూసిన వెంటనే కనబడకుండా (డిజెప్పీర్) అయిపోతుంది.ఈ మెసేజ్ అందుకున్నవారికే కాదు.. పంపించిన వారి వాట్సప్ లోనూ ఇది కనిపించదు. ఇదే ఈ ఫీచర్ ప్రత్యేకత. కానీ, ఈ ఫీచర్ ను మెసేజ్ పంపిన ప్రతిసారి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే, మీరు ఒకరికి ఫోటో లేదా వీడియో పంపిన తరువాత అవతలి వారు పదే పదే ఈ ఫోటో లేదా వీడియో చూసే అవసరం లేదు అని అనుకున్నపుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఫోటో లేదా వీడియో షేర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ గ్రూపులకు చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, గ్రూపులోని సభ్యులందరూ మీరు షేర్ చేసిన ఫోటో లేదా వీడియో చూసేంతవరకూ ఇది కనిపిస్తుంది. ఒక్కసారి గ్రూప్ లో అందరూ చూసిన తరువాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోతుంది. ఇక ఆ ఫోటో లేదా వీడియో ఎవరు చూశారనే విషయం మెసేజ్ ఇన్ఫో సెక్షన్ లో కనిపిస్తుంది. గ్రూప్ లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉన్నా కూడా ఈ వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా మీరు పంపిన ఫోటో లేదా వీడియోలను చూసే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







