కార్మికులు వడదెబ్బ ముప్పు..ఆరోగ్య శాఖ హెచ్చరిక
- July 02, 2021
సౌదీ: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పని చేసే సమయంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నేరుగా ఎండ తగిలే ప్రాంతాల్లో పని చేస్తున్నప్పుడు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో శరీర వేడి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగినప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, అప్పుడు శరీరం డిహైడ్రేషన్ కు గురి అవుతందని పేర్కొంది. అలసట, తలనొప్పి, వికారం, హర్ట్ బీట్ పెరిగటం వడదెబ్బ లక్షణాలని వెల్లడించింది. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆ బాధితుడ్ని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి, దుస్తులను తొలగించాలి. మెడ దగ్గర, చంకలో ఐస్ ముక్కులను పెట్టాలి. శరీరంపై నీళ్లను చల్లుతూ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయటం ద్వారా బాధితుడికి ఉపశమనం కలిగించొచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండి బాధితుడికి వాంతులు అయినా, వడదెబ్బ లక్షణాలు గంట కంటే ఎక్కువ సేపు ఉన్నా అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!