వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు ల్యాండ్, సీ బోర్డర్స్ ఓపెన్
- July 02, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్న తమ పౌరులు దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు, వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది.ఇవాళ్టి నుంచి ప్రతి రోజు 12 గంటల పాటు భూ, సముద్ర సరిహద్దులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ల్యాండ్, సీ బోర్డర్స్ ద్వారా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు,వారి కుటుంబ సభ్యులు, డొమస్టిక్ వర్కర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.అయితే..దేశ పౌరులు వారి రక్త సంబంధీకులు, డొమస్టిక్ వర్కర్లు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి.ఇదిలా ఉంటే ఆగస్ట్ 1 నుంచి వ్యాక్సిన్ పొందిన ప్రవాసీయులకు కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు కువైట్ ఇప్పటికే ప్రకటించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని