ఫాంహౌస్ లో వ్యభిచారం, మందు పార్టీలు..బిల్డింగ్ కూల్చివేత
- July 02, 2021
కువైట్: అది పేరుకే ఫాంహౌస్.అక్కడ జరిగేవన్ని భంచిక్ భంచిక్ బాగోతాలే.రేవ్ పార్టీల తరహాలో వైల్డ్ పార్టీ నిర్వహించటం అక్కడ పరిపాటి.ఓవరాల్ గా చెప్పాలంటే ఫాంహౌస్ ముసుగులో బార్ సెటప్.వ్యభిచారానికి అడ్డా.గట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బాగోతాన్ని బట్టబయలు చేశారు జెహ్రా పోలీసులు.విశ్వసనీయ సమాచారంతో కువైట్ మున్సిపాలిటీ అధికారులతో కలిసి రైడ్ చేశారు.అయితే..అప్పటికే నిర్వాహకులు అక్కడ్నుంచి తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.ఫాంహౌస్ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు ఉన్నాయని, మహిళల దుస్తులు, మెకప్ సామాగ్రి ఉన్నట్లు తెలిపారు. పార్టీలకు వచ్చే వారు మగువులతో గడిపేందుకు ప్రత్యేకంగా బెడ్రూంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.దీంతో తమకు అందిన సమాచారం మేరకు ఫాంహౌస్ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించుకొని మున్సిపాలిటీ అధికారుల సహకారంతో ఫాంహౌస్ ను కూల్చివేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..