భారత్-ఖతార్ ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు పెంపు
- July 02, 2021
దోహా: భారత్-ఖతార్ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీ గురువారం ప్రకటించింది.ఈ ఒప్పందం ప్రకారం విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభమైనట్లు ఇండియన్ ఎంబసీ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.భారత్, ఖతార్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు 2021 జూలై వరకు పొడిగించబడింది. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటున్న ఇరు దేశాలకు చెందిన సివిల్ ఏవియేషన్ అథారిటీలు, విమానయాన సంస్థలకు ధన్యవాదాలు అని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.కాగా, ఇంతకుముందు ఉన్న ఒప్పందం ప్రకారం ఎయిర్ బబుల్ గడువు జూన్ 30 తో ముగిసింది.దీంతో తాజాగా ఇరు దేశాలు చర్చల అనంతరం గడువును జూలై 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి