ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
- July 03, 2021
హర్యానాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్లడానికి నిశ్చితార్థం కూడా చేసుకుంది మెహ్రీన్. ఆయన మనవడు భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో మునిగి పెళ్లికి సిద్ధమైంది.

అయితే చివరి నిమిషంలో ఈ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. మార్చ్ 13న ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కేవలం రెండు కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. నేడో రేపో పెళ్లి తేదీ అనౌన్స్ చేస్తారు అనుకుంటే.. ఏకంగా బ్రేకప్ కహానీ పోస్ట్ చేసింది మెహ్రీన్. తమ పెళ్లి ఆగిపోయిందని.. ఇకపై భవ్య కుటుంబంతో పాటు ఆయనతో కూడా ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని.. ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూస్తారని కోరుకుంటున్నట్లు తెలిపింది మెహ్రీన్. తన పెళ్లి ఆగిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు మెహ్రీన్.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







