ఎక్స్‌పో 2020: రెట్టింపు సామర్థ్యంతో పనిచేయాలన్న షేక్ హమదాన్

- July 03, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020: రెట్టింపు సామర్థ్యంతో పనిచేయాలన్న షేక్ హమదాన్

దుబాయ్: అక్టోబర్ నెలలో జరగాల్సి వున్న ఎక్స్‌పో 2020 కోసం రెట్టింపు సామర్థ్యంతో పనిచేయాల్సి వుందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ అభిప్రాయపడ్డారు.లక్ష్యాన్ని అందుకోవడానికి తగినంత శక్తి మనకుందని చెబుతూ, రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి వుందని అన్నారు.సుప్రీం కమిటీ ఫర్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ దుబాయ్‌తో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు క్రౌన్ ప్రిన్స్. ప్రతి ఒక్కరి ఆరోగ్యం,భద్రత పరిగణనలోకి తీసుకుని,ఆరు నెలల మెగా ఈవెంట్ విషయంలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.కాగా, దుబాయ్ హెల్త్ అథారిటీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ గురించి కూడా క్రౌన్ ప్రిన్స్ ఆరా తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com