ఏపీ కరోనా అప్డేట్
- July 03, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు,మృతుల సంఖ్య క్రమంగా కిందికి దిగుతోంది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,532 సాంపిల్స్‌ను పరీక్షించగా…2,930 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది..మరో 36 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్‌లో నలుగురు చొప్పున,కడప, ప్రకాశం, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, అనంతపూర్, కృష్ణా, విశాఖలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.మరోవైపు గడచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
ఇక,నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,22,68,483గా బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,99,748కు పెరగగా..మొత్తం రికవరీ కేసులు 18,51,062కి చేరాయి.ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 12,815కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,871గా ఉన్నాయి.తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 591 పాజిటివ్ కేసులు నమోదు కాగా..చిత్తూరులో 443, ప్రకాశం జిల్లాలో 363 కేసులు, పశ్చిమ గోదావరిలో 338 కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







