ఈ నెలలో 50 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సినేషన్

- July 04, 2021 , by Maagulf
ఈ నెలలో 50 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సినేషన్

సౌదీ: రానున్న అకాడమిక్ ఇయర్ నుంచి స్కూళ్లను రీఓపెన్ చేయాలని నిర్ణయించిన సౌదీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరు నాటికి దాదాపు 50 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు విద్యాశాఖ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేలా ఓ అవగాహనకు వచ్చాయి. 12 ఏళ్ల వయస్సున్న విద్యార్ధుల నుంచి అంతకుపైబడిన వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అలాగే విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తూ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.అంటే టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్, ఇతర సహాయక సిబ్బందితో పాటు వర్సిటీలలోని స్టాఫ్ కూడా వ్యాక్సిన్ ఇస్తారు.ఇదిలా ఉంటే..12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారమే నిర్ణయించిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com