తెలంగాణ కోవిడ్ అప్డేట్
- July 04, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 6,26,690 కేసులు నమోదయ్యాయి.ఇందులో 6,11,035 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,11,964 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక, గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,691 కరోనా మరణాలు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,088 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలియజేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







