2021 ఫస్టాఫ్ లో 8000 మంది ప్రవాసీయులను పంపేసిన కువైట్

- July 05, 2021 , by Maagulf
2021 ఫస్టాఫ్ లో 8000 మంది ప్రవాసీయులను పంపేసిన కువైట్

కువైట్: వివిధ కారణాలు, నేరాలతో 2021 తొలి అర్ధ సంవత్సరంలో 8000 మంది ప్రవాసీయులను దేశం నుంచి పంపివేసినట్లు కువైట్ వెల్లడించింది. ఇందులో 7,808 మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లినట్లు అంతర్గత మంత్రిత్వ శాక వెల్లడించింది. వాళ్లంతా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించటం, వివిధ నేరాలకు పాల్పడటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటం వంటి నేరాలకు పాల్పటంతో వాళ్లపై దేశబహిష్కరణ వేటు పడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 700 మంది దేశ విడిచి వెళ్లేందుకు డిపార్టేషన్ సెంటర్స్ లో వేచి చూస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది శ్రీలంక, వియత్నాం పౌరులని అధికారులు వివరించారు. ప్రస్తుతం శ్రీలంక, వియత్నాం విమానాశ్రయాలు మూతపడటంతో వాళ్లు వేచి చూడాల్సి వస్తుందని అన్నారు. దేశ శాంతి భద్రతలను కాపాడేందుకు సెక్యూరిటీ క్యాంపేన్ లు కొనసాగుతాయని.. పౌరులు, ప్రవాసీయులు భద్రతాధికారులతో సహకరించాలని అధికారులు కోరారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com