తెలంగాణ కోవిడ్ అప్డేట్

- July 04, 2021 , by Maagulf
తెలంగాణ కోవిడ్ అప్డేట్

హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.కేసుల‌తో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రాష్ట్రంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండ‌టంతో కేసులు త‌గ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేసింది.ఈ బులిటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 605 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 6,26,690 కేసులు న‌మోద‌య్యాయి.ఇందులో 6,11,035 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,11,964 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఏడుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,691 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో 1,088 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు తెలంగాణ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో తెలియ‌జేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com