రేపు పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్రెడ్డి..!
- July 06, 2021
హైదరాబాద్: గాంధీభవన్లో రేపు టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఐదు వేల బైక్ లతో ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ రూపొందించాయి. ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 బైకులు పాల్గొనాలని నిర్ణయించారు. మరోవైపు వరుసగా కీలక నేతలను కలుస్తూ రేవంత్ బిజీగా ఉన్నారు.బెంగళూరుకు వెళ్లిన ఆయన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు పలువురు నేతలను కలిశారు.ఈరోజు ఆయన బెంగళూరు నుంచి హైదరాబాదుకు చేరుకున్న తరవాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ రెడ్డి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలతో రేవంత్ భేటీ కానున్నారు.వాస్తవానికి రేవంత్ ను కలవడానికి వీరిద్దరూ ఆసక్తి చూపలేదని సమాచారం.అయితే మల్లు రవి వీరితో చర్చలు జరిపి ఒప్పించినట్టు తెలుస్తోంది.మల్లు రవి మంత్రాంగంతో వారు కాస్త దిగొచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







