1000 ఉద్యోగాల కోసం 17,000కి పైగా దరఖాస్తుదారులు
- July 06, 2021
మస్కట్: మొత్తం 9 ప్రభుత్వ రంగ యూనిట్లలో 1000 ఉద్యోగాల కోసం 17,000కి పైగా దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. వీరంతా పరీక్షలకు అనుమతించబడ్డారు. ఈ మేరకు ఒమన్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ - అల్ కువైర్, మంగళవారం రాత పరీక్షల్ని ఉద్యోగార్థుల కోసం పరీక్షల్ని ప్రారంభించింది. పబ్లిక్ సెక్టారులోని ఉద్యోగాలకు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం అనుమతించబడిన దరఖాస్తుదారుల సంఖ్య 17,525 కాగా, 1003 ఉద్యోగావకాశాలు తొమ్మిది ప్రభుత్వ యూనిట్లలో వున్నాయి. పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జులై 15 వరకు కొనసాగుతాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30 నుంచి 40 నిమిషాల వరకు పరీక్షల్ని బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్నారు. కొత్త గ్రూప్ టెస్టింగ్ కోసం ఫలితాల్ని ప్రకటించడం జరుగుతోంది. టెస్టులో 30 ప్రశ్నలు వుంటాయి. 20 ప్రశ్నలు స్పెషాలిటీకి సంబంధించినవి కాగా, ఐదు మానసిక సామర్థ్యానికి సంబంధించి, ఐదు జనరల్ కల్చర్‌కి సంబంధించినవి.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







