సౌదీ అరేబియా - ఒమన్ మధ్య కొత్త రోడ్డు త్వరలో ప్రారంభం

- July 07, 2021 , by Maagulf
సౌదీ అరేబియా - ఒమన్ మధ్య కొత్త రోడ్డు త్వరలో ప్రారంభం

రియాద్: సౌదీ అరేబియా - ఒమన్ దేశాల్ని కలిపే తొలి రోడ్డు త్వరలో ప్రారంభం కానుంది. ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్‌సెక్రెటరీ సలెమ్ ముహమ్మద్ అల్ నుయైమి మాట్లాడుతూ రోడ్డు దాదాపు పూర్తయినట్లు చెప్పారు. రోడ్డు వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే పని వేగవంతంగా జరుగుతోందని అన్నారు. ఏళ్ళ తరబడి ఈ రోడ్డు నిర్మాణంలో జాప్యం జరిగింది. దూరం అలాగే ప్రయాణ సమయం ఈ రోడ్డు కారణంగా తగ్గుతుంది. ఈ రోడ్డులో అత్యధిక భాగం సౌదీ అరేబియాలో వుంటుంది. ఎంప్టీ క్వార్టర్ వంటి అత్యంత కఠినమైన ప్రాంతాల మీదుగా రోడ్డు వెళుతుంది. ఒమన్‌లో 160 కిలోమీటర్ల రోడ్డు వుంటుంది. సౌదీ అరేబియాలో 580 కిలోమీటర్ల దూరం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com