జనసేన కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్
- July 07, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా జనసేన పార్టీ కమిటీలను ప్రకటించారు. ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా.. 17 మందిని కార్యదర్శులుగా.. 13 మందిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.. ఇక, 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించారు జనసేనాని.. మరోవైపు.. ఐటీ, డాక్టర్స్, చేనేత, మత్స్యకారులు, లీగల్ విభాగాలను ఏర్పాటు చేసి.. వాటికి అధ్యక్షులను నియమించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా – బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ – పోతిన మహేష్, తూర్పుగోదావరి – కందుల దుర్గేష్, చిత్తూరు – డాక్టర్ పి. హరిప్రసాద్, అనంతపురం – వరుణ్, ప్రకాశం జిల్లా – షేక్ రియాజ్, నెల్లూరు – సీహెచ్ మని క్రాంత్ రెడ్డి, పశ్చిమగోదావరి – కె.గోవింద రావు, గుంటూరు – గాదె వెంకటేశ్వరరావును నియమించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







