కేంద్ర కేబినెట్‌ కొత్త మంత్రుల శాఖల వివరాలు...

- July 07, 2021 , by Maagulf
కేంద్ర కేబినెట్‌ కొత్త మంత్రుల శాఖల వివరాలు...

న్యూ ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మంత్రులతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు.​ ఇందులో 15 మందికి కేబినెట్​ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్‌ రిజిజు, మన్‌సుఖ్‌ మాండవియా, హరిదీప్‌సింగ్‌ పురీ, రామచంద్ర ప్రసాద్​ సింగ్‌.. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కలసికట్టుగా.. ఒక బృందంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు ప్రధాని శాఖలను కేటాయించారు. పరిపాలనా అనుభవం, సమర్థతలకు అనుగుణంగా ప్రధాని శాఖలను కట్టబెట్టారు.

మంత్రుల శాఖల వివరాలు... 

1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - ఉద్యోగుల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్లు, అణుశక్తి శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (అంతరిక్ష శాఖ), అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు, ఇతర మంత్రులకు కేటాయించని మిగతా శాఖలు 

2. రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ

3. అమిత్ షా - హోంశాఖ, అదనంగా సహకార మంత్రిత్వ శాఖ

4. నితిన్ జైరామ్ గడ్కరీ - జాతీయ రహదారులు, రవాణా శాఖ

5. నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు

6. నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలు

7. డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ - విదేశీ వ్యవహారాల శాఖ

8. అర్జున్ ముండా - ట్రైబల్ ఎఫైర్స్

9. స్మృతి ఇరానీ - మహిళ, శిశు సంక్షేమ శాఖ

10. పీయూష్ గోయెల్‌ - వాణిజ్యం మరియు పరిశ్రమలు, టెక్స్‌టైల్ శాఖ, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహారం మరియ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 

11. ధర్మేంద్ర ప్రధాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆంత్రప్రెన్యూర్‌షిప్ శాఖ

12. ప్రహ్లాద్ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్ (బొగ్గు), మైన్స్ శాఖలు

13. నారాయణ్ తాటు రాణే - మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ శాఖ

14. సర్బానంద సోనోవాల్ - పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ, ఆయుష్ శాఖలు

15. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాల శాఖ

16. డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ

17. గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంజాయతీ రాజ్ శాఖలు

18. జ్యోతిరాదిత్య సింధియా - పౌరవిమానయాన శాఖ

19. రామచంద్ర ప్రసాద్ సింగ్ - ఉక్కు మంత్రిత్వ శాఖ

20. అశ్విని వైష్ణవ్ - రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలు

21. పశుపతి కుమార్ పారస్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ

22. గజేంద్ర సింగ్ షెకావత్ - జలశక్తి మంత్రిత్వశాఖ

23. కిరెణ్ రిజిజు - న్యాయశాఖ

24. రాజ్ కుమార్ సింగ్ - పవర్ మినిస్ట్రీ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ

25. హర్‌దీప్ పూరీ - పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ

26. మంసుఖ్ మాండవీయ - ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ 

27. భూపేంద్ర యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ

28. మహేంద్ర నాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ

29. పర్షోత్తమ్ రూపాలా - ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ మరియు డెయిరీ శాఖ

30. జి. కిషన్ రెడ్డి - సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి

31. అనురాగ్ సింగ్ ఠాకూర్ - సమాచారం మరియు బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖలు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com