ఊహించని విధంగా 40 లక్షల మంది కోవిడ్‌కు బలి: WHO
- July 08, 2021
జెనీవా: కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా సుమారు నలభై లక్షల మంది ప్రాణాలు విడిచారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం తెలిపింది.పలు ఆసియా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ధనిక దేశాలు నిబంధనలు సడలించేందుకు సిద్ధమయ్యాయని పేర్కొంది. ఆసియాలోని పలు దేశాలు ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉన్నాయని, ఇక ఇండోసేషియాగా సరికొత్త హాట్‌స్పాట్ ప్రాంతంగా మారిపోయిందని తెలిపింది.మరణాల రేటు నెలలో పదిరెట్లు పెరిగిపోయాయని, ప్రపంచం అత్యంత ప్రమాదకర దశలో ఉందని డబ్ల్యుహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గెబ్రాయాసిస్ అన్నారు.నలభై లక్షల మంది మరణిస్తారని అస్సలు ఊహించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.అదేవిధంగా ధనిక దేశాలకు ఆయన తలంటారు.పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు, రక్షణ పరికరాలు నిల్వ చేయడంపై మండిపడ్డారు.ఆంక్షలను సడలించేందుకు కరోనా తగ్గిపోయిందంటూ చెబుతున్నాయని పేర్కొన్నారు.ఇండోనేషియాలో సాధ్యమైనంత వరకు ఇంటి నుండి పనిచేయాలని, వ్యాపార సముదాయాలకు తెరచి ఉంచే సమయంపై ఆంక్షలను విధించాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వైరస్ వ్యాప్తి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నానని ..జావాలోని శ్మశాన వాటికలో మృతదేహాలను దహన సంస్కారాలు చేసేందుకు అంబులెన్స్‌లు క్యూలైన్లలో ఉండటంపై స్థానికుడు నేషన్ నష్మానా అన్నారు.కానీ తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయని అన్నారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







