కోలీవుడ్‌లో హీరోగా రీఎంట్రీ కానున్నా ప్రభుదేవా ..
- March 09, 2016
ప్రభుదేవా రీఎంట్రీ అవుతున్నారు. డాన్స్, నటన, దర్శకత్వంలో రాణించడంతో పాటు, బహుభాషా కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా 2004 విజయకాంత్‌తో కలసి నటించిన ఎంగళ్ అన్నా చిత్రం విడుదలైంది. ఆ తరువాత ఆయన నటించిన తమిళ చిత్రం తెరపైకి రాలేదు. ఆ మధ్య కలవాడియ పొళుదుగళ్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించినా ఆ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దర్శత్వం పైనే దృష్టి సారించిన ప్రభుదేవా బాలీవుడ్‌లో పలు భారీ చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.తాజాగా కోలీవుడ్‌లో హీరోగా రీఎంట్రీ కానున్నారు.విజయ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ ఈ మధ్య నటనకు చాలా దూరంగా ఉన్నానన్నారు. ఒక హారర్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని తెలిపారు.అది ఇప్పుడు నటుడిగా నెరవేరబోతోందని అన్నారు.హారర్ కథా చిత్రంలో తాను నటించడం ఇదే తొలి సారి అని అన్నారు. ఇందులో తన గెటప్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. ప్రభుదేవా సరసన తమన్న నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం.ఈ చిత్రం ప్రస్తుతం పూనేలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







