ఫ్యామిలీ, టూరిస్ట్ ప్రవేశ వీసాల జారీపై ఖతార్ కీలక నిర్ణయం!

- July 09, 2021 , by Maagulf
ఫ్యామిలీ, టూరిస్ట్ ప్రవేశ వీసాల జారీపై ఖతార్ కీలక నిర్ణయం!

దోహా: ఫ్యామిలీ,టూరిస్ట్ ప్రవేశ వీసాల జారీపై ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది.జూలై 12 నుండి ఈ వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.కోవిడ్ -19 పరిణామాలకు సంబంధించి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఆమోదించబడిన ప్రయాణ నిబంధనలకు లోబడి ఈ నిర్ణయం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఖతార్‌కు తిరిగి వచ్చే దేశ పౌరులు,నివాసితులు ఎంట్రీకి 14 రోజుల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

అలాగే ఖతార్ ఆమోదించిన వ్యాక్సిన్ తీసుకున్న సందర్శకులు ప్రవేశానికి 14 రోజుల ముందు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే వారికి కూడా క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.అంతేగాక ప్రయాణికులందరూ జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది.దేశాలను మూడు వర్గాలుగా వర్గీకరించిన తరువాత పౌరులు, నివాసితులకు క్వారంటైన్ నియమాలు నిర్ణయించబడతాయని పేర్కొంది.దేశాలను ఎరుపు, పసుపు,ఆకుపచ్చ కేటగిరీలుగా వర్గీకరించారు.వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు వారు ప్రయాణించే దేశాలపై ఆధారపడి ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉంటుందని మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.  

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com